ETV Bharat / briefs

ఈ ఏడాది ఖైరతాబాద్​ గణపతి రూపం ఇదే

గణపతి పండుగ వస్తుందంటే చాలు..అందరి చూపు హైదరాబాద్​ ఖైరాతాబాద్​ గణపతి వైపే. ప్రతి ఏడాది ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శనమిస్తుంటాడు విఘ్నేశ్వరుడు. ఈసారి సైతం శ్రీ ద్వాదశాదిత్య మహా గణపతి రూపంలో 61 అడుగుల ఎత్తుతో దర్శనమివ్వబోతున్నాడు.

ఈ ఏడాది ఖైరతాబాద్​ గణపతి రూపం ఇదే
author img

By

Published : Jun 25, 2019, 7:39 PM IST

ఈ ఏడాది ఖైరతాబాద్​ గణపతి రూపం ఇదే

గణపతి నవరాత్రులు అనగానే అందరి మదిలో టక్కున మెదిలేది హైదరాబాద్​ ఖైరతాబాద్​ మహాగణేశుడే. వినాయకుని పండుగ దగ్గరపడిందంటే చాలు... ఖైరతాబాద్ గణేశుని ఎత్తు, రూపంపై జోరుగా చర్చ జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రూపంలో ఇక్కడి వినాయకుడు దర్శనమిస్తుంటాడు. అలాగే ఈ ఏడాది సైతం శ్రీ ద్వాదశదిత్య ఆకృతిలో అందరి ముందుకు రాబోతున్నాడు. 61 అడుగుల ఎత్తుతో నిర్మించే ఈ ఖైరతాబాద్​ గణేశుడికి కుడివైపున విష్ణు, ఏకాదశి దేవి... అలాగే ఎడమ వైపు బ్రహ్మా, విష్ణు మహేశ్వరులు ​, దుర్గాదేవి కొలువుతీరనున్నారు.

ఇవీ చూడండి:కొత్త సచివాలయానికి డీ బ్లాక్​ వెనక భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.