ETV Bharat / briefs

పది రోజుల్లో తిరుపతిలో తెలుగు రాష్ట్రాల సీఎస్​ల భేటీ

నీటిపారుదలతో పాటు విభజన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు.. పది రోజుల తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉంది. తిరుపతి వేదికగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Jun 29, 2019, 12:04 PM IST

Updated : Jun 29, 2019, 12:22 PM IST

ap-tg-cs
పది రోజుల్లో ఇరు రాష్ట్రాల సీఎస్​లు భేటీ

తెలుగు రాష్ట్రాల సీఎస్​లు, ఉన్నతాధికారులు తిరుపతిలో పదిరోజుల తర్వాత భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. చర్చల సారాంశాన్ని అధికారులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరిస్తారని,.. దీని తర్వాత అవసరమైతే సీఎంలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి వరకు ఏపీ, తెలంగాణ అధికారుల చర్చలు కొనసాగాయి. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లు, విద్యుత్, పౌరసరఫరాలు, ఏపీ భవన్, ఉద్యోగుల విభజన అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. అంశాలు, సమస్యలపై స్పష్టతకు వచ్చిన ఇరు రాష్ట్రాల అధికారులు.. ఆయా అంశాల వారీగా విడివిడిగా తదుపరి కసరత్తు చేయనున్నారు.

Intro:రానున్న ఖరీఫ్ రబీ సీజన్లలో ఏ ఏ పంటలకు ఎంత రుణాలు లు ఇవ్వాలి అనే దానిపై పై జిల్లాస్థాయి టెక్నికల్ కమిటీ సమావేశమైంది. గుంటూరులోని సహకార బ్యాంకు పరిపాలన కార్యాలయంలో లో జరిగిన సమావేశంలో 2019 20 సంవత్సరానికి గాను మత్స్య రంగంలో హెక్టారుకు గతంలో లో రెండు లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వగా....ఈ ఏడాది మూడు లక్షలు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా జిల్లాలో ప్రధానమైన పత్తిపంటకు గత సంవత్సరం 43000 రుణాన్ని మంజూరు చేయగా, రాష్ట్ర స్థాయి కమిటీ 36 వేల పై కుదించింది. అయితే జిల్లాలోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పత్తి పంటకు 43000 ఇచ్చేందుకు జిల్లాస్థాయి కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మార్పు చేసిన పంట రుణాల నివేదికలను ఆమోదించాలని కోరుతూ రాష్ట్ర స్థాయి కమిటీ కి నివేదికలను పంపింది. సమావేశంలో లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ వెంకటసుబ్బయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ సుదర్శన్ రావు, సీఈవో సుబ్రహ్మణ్యేశ్వర రావు పాల్గొన్నారు.
bite: సుదర్శన్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ గుంటూరు.

Body:guntur west

Conclusion:kit no.765
80085 74897
Last Updated : Jun 29, 2019, 12:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.