ETV Bharat / briefs

జగన్​కు ఒక అవకాశమిచ్చారు: గల్లా జయదేవ్ - తెదేపా

ఎంపీగా గెలుపొందిన అనంతరం తొలిసారి తన సొంత గ్రామమైన పేటమిట్టలో గల్లా జయదేవ్ పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒక్క చాన్స్ అని ప్రజల్లోకి వెళ్లిన  జగన్​కు ప్రజలు అవకాశం ఇచ్చారని అభిప్రాయపడ్డారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు.

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్
author img

By

Published : May 30, 2019, 6:42 PM IST

జగన్​కు..ప్రజలు ఒక చాన్స్ ఇచ్చారు : తెదేపా ఎంపీ గల్లా జయదేవ్

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో పర్యటించారు. ఎంపీగా గెలుపొందిన అనంతరం తొలిసారి తన సొంత గ్రామానికి వచ్చిన ఎంపీకు తెదేపా కార్యకర్తలు స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయన్నారు. 2014లో రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన సీఎం కావాలనుకున్న ప్రజలు చంద్రబాబును ఎన్నుకున్నారన్న ఆయన... 2019 ఎన్నికలలో ఒక్క చాన్స్ అని ప్రజల్లోకి వెళ్లిన జగన్​కు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్​ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ...వారి సమస్యలపై పోరాడతానని జయదేవ్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : చంద్రబాబుకు కృతజ్ఞతలు: గల్లా జయదేవ్

New Delhi, May 30 (ANI): Businessman and husband of Congress leader Priyanka Gandhi, RobertVadra arrived at the office of Enforcement Directorate on Thursday in connection with a money laundering case. The case involves the purchase of properties in London, Dubai, Rajasthan and the National Capital Region. ED issued fresh summon to Robert Vadra after moving to court last week seeking cancellation of his anticipatory bail.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.