తంబళ్లపల్లి మండలం కోటకొండ ఎగువ సుగాలి తండా, పెద్దమందడి మండలం రామా నాయక్ తండా, ఆవికే నాయక్ తండాను గ్రామ పంచాయతీలు గుర్తిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. ఈ గ్రామాల్లో నివసిస్తోన్న 18 సుగాలి తండాలు ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని గ్రామస్తులు తెలిపారు. కనీస మౌలిక సదుపాయాల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ఈ గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని కోరారు. పంచాయతీలుగా ఏర్పడడానికి కారణమైన అధికారులు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దమండ్యం మండలంలోని 18 తండాల ప్రజలు, తంబళ్లపల్లి మండలంలోని కోటకొండ ఎగు, దిగువ తండాల్లో నివసిస్తోన్న గిరిజనులు...తమ తండాలను గ్రామపంచాయతీలు గుర్తించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన ఈ మూడు పంచాయతీలకూ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చూడండి : సాగుతోంది వ్యాపారం... కొల్లేరుకు వీడని గ్రహణం