విజయనగరం జిల్లా సీతానగరంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువైంది. అవి చేస్తున్న దాడులతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. సీతానగరంలో వీధి శునకాల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్నానానికి వెళ్తుండగా గురుమూర్తి అనే వ్యక్తి ముఖంపై.. ఓ పిచ్చికుక్క కరిచింది. చిన్నారులు కె.పార్థసారథి, వినయ్తో పాటు మరో బాలికను గాయపర్చింది. క్షతగాత్రులు పార్వతీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి...బావిలో పడిన లారీ... డ్రైవర్ మృతి