శ్రీరామ నవమి కల్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో నేడు కనులవిందుగా రామకల్యాణం జరగనుంది. తెలుగు సంవత్సరాది రోజున పంచాంగ శ్రవణంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి.
ఇవాళ ఛైత్రశుద్ధ నవమి... సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక కల్యాణం తిలకించడం వల్ల పాపాలు పోయి సకల పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే కల్యాణం చూసేందుకు వేలాదిగా భద్రాచలానికి తరలివస్తున్నారు.
రేపు రామయ్య... పట్టాభిషిక్తుడవుతాడు. రాజ కిరీటం, రాజ దండం ధరింపచేసి సకల రాజలాంఛన సేవలు చేస్తారు. 16న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేద పండితులు స్వామి వారి ఆశీర్వచనం అందిస్తారు. 17న సీతారాములకు తెప్పోత్సవం, దొంగల దోపోత్సవం ఆనందకరంగా జరుపుతారు. 18న సింహ వాహనమున వేంచేపింప చేసి ఊంజల్ సేవ చేస్తారు. 19న వసంతోత్సవం జరుగుతుంది. 20న శ్రీ చక్రంకు నదీ స్నానం చేయించి ఉత్సవాలను సమాప్తి చేస్తారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు బ్రహ్మోత్సవాలను చూసి తరించండి... శ్రీరాముని ఆశీస్సులు పొందండి.
ఇవీ చూడండి: