ETV Bharat / briefs

ఆంధ్రా ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిన జగన్! - ఎన్నికల ప్రచారం

వ్యక్తిగత ప్రయోజనాల కోసం జగన్... మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాల్ని దిల్లీలో తాకట్టు పెట్టడం సరికాదని ప్రకాశం జిల్లా గిద్దలూరులో వ్యాఖ్యానించారు.

ప్రకాశం జిల్లా  గిద్దలూరులో జనసేనాని ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 3:28 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరులో జనసేనాని ఎన్నికల ప్రచారం
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్ షా పాదాల వద్ద జగన్ తాకట్టు పెట్టారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్నికల ప్రచారం చేశారు. రెండేళ్లు జైలుకి వెళ్లి వచ్చిన జగన్.. ఇప్పుడు మహాత్మా గాంధీలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నటన వదులుకుని రాష్ట్రం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్‌ కల్యాణ్... నిజాయితీతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. సీఎం కుర్చీ కోసం జగన్ 1500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దులా... అల్లా సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రైతులకు 5 వేల రూపాయలపింఛన్‌ పథకంపై తొలి సంతకం చేస్తానని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:'జగన్ వస్తే.. నవరత్నాల అమలు ఖాయం'

Intro:ap-rjy-101-27-mlc winner iv spl-avb-c18
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో విజయం వైపు దూసుకుపోతున్న ఇళ్ల వెంకటేశ్వరరావు మనసులో మాట ఈటీవీ భారత్ తో

Body:ap-rjy-101-27-mlc winner iv spl-avb-c18

Conclusion:ap-rjy-101-27-mlc winner iv spl-avb-c18
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.