ETV Bharat / briefs

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు: కోడెల

సార్వత్రిక ఎన్నికలు అభివృద్ధి, ఆరాచకానికి మధ్య జరిగిన ఎన్నికలని సభాపతి  కోడెల అభివర్ణించారు.  తెదేపాను ఓడించేందుకు భాజపా, వైకాపా, టీఆర్​ఎస్ పార్టీలు ఎన్నికల కమీషన్​తో కుమ్మక్కై  ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. వారు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా..ప్రజలు  తమకు ఓట్లు వేశారని తమ  ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సభాపతి కోడెల శివప్రసాద్
author img

By

Published : Apr 15, 2019, 5:40 PM IST

సభాపతి కోడెల శివప్రసాద్

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా పలు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఎన్నికల్లో గెలవలేక మోదీ, కేసీఆర్​లతో చేతులు కలిపిన వైకాపా దాడులకు దిగిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 130 పైనే అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రౌడీ రాజకీయ నాయకుల పని పడతామన్నారు.

సభాపతి కోడెల శివప్రసాద్

ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా పలు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఎన్నికల్లో గెలవలేక మోదీ, కేసీఆర్​లతో చేతులు కలిపిన వైకాపా దాడులకు దిగిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 130 పైనే అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రౌడీ రాజకీయ నాయకుల పని పడతామన్నారు.

ఇదీ చదవండి

మోదీ హెలీకాప్టర్లలోనే డబ్బు వెళ్తోంది: చంద్రబాబు

Intro:Ap_Vsp_95_07_Police_Commissinor_On_Election_Cases_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ నగర పరిధిలో ఇప్పటివరకు 333 కేసుల్లో మూడు వేల 3,398 మందిని బైండోవర్ చేశామని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లాడ్డా తెలిపారు.


Body:విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా నగర పరిధిలో ఇప్పటి వరకు ఐదు కోట్ల మేర నగదును సీజ్ చేశామని అలాగే 108 ఎక్సైజ్ కేసులు 773 లీటర్ల మద్యం సీజ్ చేశామని తెలిపారు. నగరంలో లైసెన్సు కలిగిన 819 ఆయుధాలను సాధన పట్టుకున్నామని 223 ఆయుధాల్ని భద్రతా పరంగా బ్యాంకులు ఏటీఎం నిర్వాహకులు ఇతరత్రా వారి వద్దనే ఉంచడం జరిగిందని తెలిపారు.


Conclusion:ఎన్నికల విధుల్లో భాగంగా 5,962 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అలాగే నాలుగు కంపెనీల సీఆర్పీఎఫ్ ఒకటిన్నర కంపెనీల ఏపీఎస్పి బెటాలియన్ ఇప్పటికే నగరానికి చేరుకున్నాయని ఆయన తెలిపారు. అలాగే ఎన్ ఎస్ ఎస్, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ తో కలిపి 1,843 మంది ఎన్నికల్లో విధుల్లోకి తీసుకుంటున్నామని.. నగర పరిధిలో 466 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని అందులో 177 అతి సమస్యాత్మక ప్రాంతాలు గా గుర్తించామని తెలిపారు. నగర పరిధిలో ఎటువంటి అల్లర్లు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ లడ్డా తెలిపారు.



బైట్: మహేష్ చంద్ర లాడ్డా, విశాఖ నగర పోలీస్ కమిషనర్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.