రైతుల విత్తన స్వేచ్ఛను బహుళజాతి కంపెనీలు హరించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ స్వతంత్రపై ప్రభావం చూపే ఇటువంటి పరిణామాలను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితులు ఎదురయ్యే స్థితి ఉంటుందని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రారంభంలోనే ఇటువంటి ఘటనలపై ప్రభుత్వ నివారణ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. స్థానిక పెప్సీ కంపెనీ మేనేజర్‌కు వినతి పత్రం అందించిన రైతు సంఘం నేతలు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : అనుమానాలొద్దు.. అధికారం మనదే: చంద్రబాబు