విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని లలిత జ్యూయలరీ షోరూంలలో.. తూనికలు, కొలతల శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. బంగారం, వెండి ఆభరణాల తూకం నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్లు తనిఖీ అధికారులు తెలిపారు. రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ పర్యవేక్షణలో సోదాలు నిర్వహించారు. ఈ సంస్థకు చెందిన కొన్ని చోట్ల బంగారు ఆభరణాల్లో చిన్నపాటి పూసలకు తూకం జరగడం లేదని గుర్తించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల బంగారం స్వాధీనం చేసుకొన్న అధికారులు విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డులోని లలిత జ్యూయలరీ షోరూను తనిఖీ చేసిన అధికారులు తూకాలు, ఇతర అంశాలు సరిగానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్నపాటి లోపాలను గుర్తించినట్లు పేర్కొన్న అధికారులు వాటిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు.
లలితా జ్యూయలరీ షోరూంలలో తూనికల, కొలతల శాఖ సోదాలు - jewellary
ప్రముఖ బంగారు, వెండి ఆభరణాల దుకాణం లలిత జ్యూయలరీస్పై తూనికలు, కొలతల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది.
విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని లలిత జ్యూయలరీ షోరూంలలో.. తూనికలు, కొలతల శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు తనిఖీలు చేశాయి. బంగారం, వెండి ఆభరణాల తూకం నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్లు తనిఖీ అధికారులు తెలిపారు. రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కమిషనర్ దామోదర్ పర్యవేక్షణలో సోదాలు నిర్వహించారు. ఈ సంస్థకు చెందిన కొన్ని చోట్ల బంగారు ఆభరణాల్లో చిన్నపాటి పూసలకు తూకం జరగడం లేదని గుర్తించినట్లు తెలిపారు. కొన్ని చోట్ల బంగారం స్వాధీనం చేసుకొన్న అధికారులు విశ్లేషణ కోసం ప్రయోగశాలకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డులోని లలిత జ్యూయలరీ షోరూను తనిఖీ చేసిన అధికారులు తూకాలు, ఇతర అంశాలు సరిగానే ఉన్నాయని పేర్కొన్నారు. చిన్నపాటి లోపాలను గుర్తించినట్లు పేర్కొన్న అధికారులు వాటిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు తెలిపారు.
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ