ETV Bharat / briefs

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి సర్వదేవతలకు ఆహ్వానం - rama

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా.. ఆలయ అర్చకులు వేదపండితులు స్వామివారికి రోజుకో విధంగా సేవలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు.

bhadrachalam seetarama kalyaanam
author img

By

Published : Apr 12, 2019, 10:54 PM IST

సీతారాముల కల్యాణానికి సర్వదేవతలకు ఆహ్వానం

భద్రాద్రి ఆలయంలో కళ్యాణపనులు వేగంగా జరుగుతున్నాయి. వేడుకలో కీలకమైన గరుడపటాన్ని ఇవాళ ఎగురవేశారు. ముందుగా బేడా మండపంలో అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములను ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి గరుడ పటాన్ని ఎగురవేశారు. తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయం వద్ద గల వైకుంఠద్వారం ఎదుట సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 14న మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం జరపనున్నారు. ఈనెల 15న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కళ్యాణ ఉత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ పందిళ్లు, భక్తులకు అందించే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను సిద్ధం చేశారు. ఎండాకాలం కావడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రేమ వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య

Intro:తిరుకల్యాణ

Body:ఉత్సవాలు

Conclusion:భద్రాచలంలోనే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేదపండితులు స్వామివారికి రోజుకో విధంగా సేవలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నేడు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద గరుడ పటాన్ని ఎగరవేశారు ముందుగా బేడా మండపంలో అగ్ని ప్రతిష్ట నిర్వహించారు అనంతరం ధ్వజస్తంభం కు గరుడ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం లక్ష్మణ సమేత రు రు సీతారాములను ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చి గరుడ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు సాయంత్రం ఆలయం వద్ద గల వైకుంఠ ద్వారం ఎదుట సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు ఈనెల 14న మిథిలా స్టేడియంలో సీత రాముల కళ్యాణం జరపనున్నారు ఈనెల 15న పట్టాభిషేకం నిర్వహించనున్నారు అన్ని ఉత్సవాల్లో కన్నా పెద్దదైన సీతారాముల కళ్యాణ ఉత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు చలువపందిళ్లు భక్తులకు అందించే ముత్యాల తలంబ్రాలు ప్రసాదాలను సిద్ధం చేశారు ఎండాకాలం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.