తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి ఛైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తితిదే ఈవో సింఘాల్‌కు అందజేశారు. తదుపరి ఛైర్మన్‌గా వైకాపా సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నియమితులు కానున్నారని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వైవీ అభ్యర్థిత్వం ఖరారైందని.. రానున్న శనివారమే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తోంది.
ముందు ఒప్పుకోకపోయినా...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ.. తితిదే పాలకమండలిని రద్దు చేస్తారని చాలామంది భావించారు. ఇదే సమయంలో.. ఛైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్‌తో పాటు.. పాలకమండలి సభ్యులు తమ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు ముందుకురాలేదు. ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునేవరకూ వేచిచూస్తామని చెప్పుకొచ్చారు. చివరికి.. తితిదే చైర్మన్‌గా పుట్టా రాజీనామా చేశారు.