విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలకు ఒకే చోట కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరగనుంది. విశాఖ నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. లెక్కింపు కేంద్రాల వద్ద మొత్తం 1272 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు నగర కమిషనర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్న మహేష్ చంద్ర... విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి నాలుగంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశామన్న విశాఖ నగర పోలీసు కమిషనర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి : విశాఖలో ఆ రెండు నియోజకవర్గాల ఫలితాలు ఆలస్యం