ఇవీ చూడండి
పేదలందరికీ కనీస ఆదాయ పథకం: రఘువీరా
రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి మేలు జరుగుతుందన్నారు ఏపీసీసీ ఛీప్ రఘువీరారెడ్డి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన... కనీస ఆదాయం పథకం కింద దేశంలో ప్రతీ పేద కుటుంబానికి ఏటా రూ.72 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి
పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ లక్ష్యమని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఇవాళ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.దేశంలో ప్రతీ పేద కుటంబానికి కనీస ఆదాయం కింద ఏడాదికి రూ.72 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఏపీకి లాభమని తెలిపారు. పేదరికాన్నినిర్మూలించేందుకు గరిబీ హఠావో 2.0 మొదలుపెడతామన్నారు.
ఇవీ చూడండి
sample description