రాష్ట్రం నుంచి దేశ రాజధానికి ప్రయాణించే ఏపీ ఎక్స్ప్రెస్ ప్రయాణం రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. వేసవి కాలంలో సమస్యలు మరింత అధికమై ప్రయాణికులు తంటాలుపడుతున్నారు. ప్రయాణ సమస్యలపై దృష్టి పెట్టి...వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వాల్తేర్ డీఆర్ఏం శ్రీవాస్తవ అన్నారు. బోగీల్లో ఏసీలు తరచూ పనిచేయడంలేదని ప్రయాణికులు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ఏపీ ఎక్స్ప్రెస్ కోసం నిర్దేశించిన బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాటిలో జనరేటర్లు పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధం చేస్తామన్నారు. ఏపీ ఎక్స్ప్రెస్ సమస్యలు చక్కదిద్దే చర్యలు చేపడతామన్నారు.
ఇవీ చూడండి : గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు