విశాఖ జిల్లా భీమిలి మండలం చేపలుప్పాడ సాగరతీరంలో ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, వాటిని ఎలా ఎదుర్కొవాలి... ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడే విధానాలను విపత్తు నిర్వహణ బృందాలు ప్రజలకు అవగాహన కల్పించాయి.
సముద్రంలో మునిగిపోతున్న వారిని ఎలా రక్షిస్తారో చేసి చూపారు. రబ్బరు బోటులు, డీప్ డ్రైవ్‌లతో ఆపదలో ఉన్న వారిని ఎలా కాపాడుతారో మాక్ డ్రిల్ నిర్వహించారు. తుఫాన్లు సంభవించినప్పుడు చెట్లు పడిపోతే...వేగంగా వాటిని తొలగించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఆర్.ఎఫ్ 31 మంది సభ్యుల బృందం, నేవీ, అగ్నిమాపక సిబ్బంది, మెడికల్, పోలీసుల బృందాలు పాల్గొన్నారు. 10వ బెటాలియన్ కమాండర్ జియాద్ ఖాన్ అధ్యక్షతన మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఇవీ చూడండి : చంద్రబాబుపై గవర్నర్‌కు మాజీ ఐఏఎస్‌ల ఫిర్యాదు