రాష్ట్రంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసి, వాటి అధికారాలను కాపాడుతామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను స్థానిక సంస్థలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి ప్రజల ముందు ఉంచుతామన్నారు. జిల్లా పరిషత్ ఆవరణలో నిర్మిస్తోన్న అక్రమ కట్టడాలపై సమావేశంలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కారణంగా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
ఇదీ చదవండి : సర్వం సిద్ధం... 21న "న్యాక్"లో యోగా దినోత్సవం