నిష్పక్షపాత, అవినీతి రహిత పాలన అందిస్తాం : మంత్రి పినెపే విశ్వరూప్ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినెపే విశ్వరూప్, కురసాల కన్నబాబు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి విశ్వరూప్...నిష్పక్షపాత, అవినీతి రహిత పాలన అందించేందుకు అధికారులు సహకరించాలని కోరారు. జిల్లాలోని సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు.
ఇదీ చదవండి : బుల్లితెర నటి అదృశ్యం... అనుమానం ఎవరి మీదంటే..?
ఇదీ చదవండి : వైరల్: అసలు చిరుత ఇలా ప్రవరిస్తుందా?