కర్నూలులోని కప్పల్నగర్లో పిచ్చికుక్క దాడిలో చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారులపై వీధి శునకం దాడికి తెగబడింది. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముభాషిరా అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక వైద్యులు తెలిపారు. క్షతగాత్రురాలిని మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలించారు. పిచ్చి కుక్కల బారి నుంచి కాపాడాలని కాలనీవాసులు పురపాలక సంఘాన్ని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి...చిరుతపులి సంచారంపై అటవీశాఖాధికారుల గాలింపు చర్యలు