ETV Bharat / briefs

కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి - కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి

ఇంటర్​ పరీక్ష పలితాల వివాదంపై హైకోర్టు స్పందించింది. బాలల హక్కుల సంఘం వేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. మళ్లీ మూల్యాంకనం చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందో సోమవారం తెలపాలని ధర్మాసనం ఆదేశించింది.

కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి
author img

By

Published : Apr 24, 2019, 12:22 AM IST

రాష్ట్రంలో ఇంటర్​ విద్యార్థులంతా అయోమయంలో ఉన్నారు. ఇంటర్​ ఫలితాలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. మళ్లీ మూల్యాంకనం చేయాలని కోరింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.

మళ్లీ మూల్యాంకనం చేయాలి

పిటిషన్‌ను లంచ్‌మోషన్‌గా తీసుకున్న హైకోర్టు ఇంటర్‌ పరీక్ష ఫలితాల వివాదంపై విచారణ జరిగింది. బాలల హక్కుల సంఘం వేసిన వ్యాజ్యంపై ధర్మాసనంలో వాదనలు జరిగాయి. ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎందుకంత సమయం?

పరీక్ష తప్పిన విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనానికి ఎంత సమయం పడుతుందని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 2నెలలు పడుతుందని అదనపు ఏజీ వాదన వినిపించారు. దీనిపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. నెలరోజుల్లో 9 లక్షల మంది ఫలితాలు ఇచ్చినప్పుడు... 3 లక్షల జవాబుపత్రాలకు అంతసమయం ఎందుకని మండిపడింది. సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వకేట్​ జనరల్​ తెలిపారు.

సోమవారం వరకు తెలపాలి:

మరోవైపు ఏజెన్సీ పనితీరుపైన మాత్రమే విచారణకు ఆదేశించారని హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది. దీనిపై న్యాయవిచారణ చేపట్టాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది దామోదర్​రెడ్డి కోరారు. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమధాన పత్రాలు ఎన్నిరోజుల్లో మళ్లీ మూల్యాంకనం చేయగలరో సోమవారం తెలపాలని హైకోర్టు ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.