ETV Bharat / briefs

బీసీలపై మోదీది కపట ప్రేమ: కళా వెంకట్రావు - ప్రధాని

వెనుకబడిన వర్గాలపై ప్రధాని మోదీ కపట ప్రేమ చూపిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బీసీల జపం చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలపై మోదీది కపట ప్రేమ: కళా వెంకట్రావు
author img

By

Published : Apr 21, 2019, 7:49 PM IST

బీసీలపై మోదీది కపట ప్రేమ: కళా వెంకట్రావు
ప్రధాని మోదీ.. ఓట్ల కోసమే వెనకబడిన వర్గాలను నెత్తికెత్తుకుంటున్నారని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. పరిపాలనలో మోదీ విఫలమైన తీరుకు ఇది నిదర్శనమని చెప్పారు. 14 అంశాలను స్పృశిస్తూ.. ప్రధానికి లేఖ రాశారు కళా వెంకట్రావు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉంటూ కులాలను రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నారని.. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించారు.

''ఓట్ల కోసం చాయ్​వాలా అని చెప్పుకొంటున్న మీరు.. బలహీన వర్గాల ప్రజలకు ఒక్క మంచిపనైనా చేశారా'' అని కళా ప్రశ్నించారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దిల్లీకి పంపిన తీర్మానాలను ఎందుకు ఆమోదించలేదన్నారు. 2018-19 బడ్జెట్​లో దేశంలోని 70 కోట్ల మంది బీసీల కోసం 7 వేల 750 కోట్లు కేటాయిస్తే.. ఆంధ్రప్రదేశ్​ బీసీల కోసం 16 వేల కోట్లు కేటాయించినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి..

విధుల నిర్వహణలో ఈసీ విఫలం: యనమల

Intro:AP_VJA_21_17_MUSLIMS_PRAYERS_FOR_CHANDRABABU_TO_BECOME_A_CM_737_G8

కేంద్రంలో మతతత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ విజయవాడలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్బన్ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మత పెద్దలు పాల్గొన్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే
షబేబరాత్ను పురస్కరించుకొని శనివారం రాత్రి అంతా జాగారం చేసి, ఆదివారం ఉదయం ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులు ప్రార్ధన లో పాల్గొని తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అల్లా ను వేడుకున్నారు. కేంద్రంలో లో భాజపా ఓడిపోవాలని, రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, హిందూ ముస్లింలు అన్నదమ్ముల కలిసి మెలిసి జీవించాలని అల్లాను ప్రార్థించారు.

బైట్1...........మక్బుల్ అహమ్మద్, మత పెద్ద
బైట్2.......... నజీర్, ఉపాధ్యక్షుడు, అర్బన్ తెలుగు యువత

- షేక్ ముర్తుజా, విజయవాడ ఈస్ట్, 8008574648.

Body:చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

Conclusion:చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.