ETV Bharat / briefs

జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు - కేసీఆర్

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ కార్యక్రమం జరిగే తీరును, ఏర్పాట్లను కాబోయే సీఎం జగన్​కు అధికారులు వివరించారు. ప్రజలు, వీఐపీలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ దిల్లీ వెళ్లే అవకాశం ఉందని వైకాపా నేతలు అంటున్నారు.

జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు
author img

By

Published : May 27, 2019, 4:44 PM IST

Updated : May 27, 2019, 5:30 PM IST

జగన్​​ ప్రమాణ స్వీకారానికి కొనసాగుతున్న ఏర్పాట్లు

ఈ నెల 30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్​ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కార్యకర్తలు, నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఏర్పాట్లు జరుగుతున్న తీరును అధికారులు జగన్​కు వివరించారు. వీఐపీలు, ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంతియాజ్... జగన్​కు తెలిపారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జగన్ దిల్లీ వెళ్లే అవకాశం ఉందని వైకాపా నేతలు అంటున్నారు. ఈ నెల 30 సాయంత్రం...ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో కలిసి, జగన్ దిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

కాబోయే సీఎం జగన్‌తో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మర్యాదపూర్వక భేటీలు కొనసాగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్​ చీఫ్​గా నియమితులయ్యారని ప్రచారం జరుగుతున్న తెలంగాణ ఐపీఎస్​ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర జగన్​ను కలిసి అభినందనలు తెలిపారు.

ఇవీ చూడండి : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్​గా స్టీఫెన్ రవీంద్ర..!

Intro:AP_ONG_21_27__MLA GANA SWAGATAM_AVB_C1
CELLNO---9100075307
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గ ,అసెంబ్లీ అభ్యర్థిగా అన్నా. వెంకట రాంబాబు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రెండో స్థానంలో గెలిచి గిద్దలూరు కు విచ్చేసిన సందర్భంగా ,అభిమానులు ,కార్యకర్తలు, వైఎస్ఆర్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు .అన్నా రాంబాబు స్థానిక రాచర్ల సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం భారీ ర్యాలీతో పార్టీ కార్యాలయం వరకు పాదయాత్ర చచేపట్టారు

Body:AP_ONG_21_27__MLA GANA SWAGATAM_AVB_C1

Conclusion:AP_ONG_21_27__MLA GANA SWAGATAM_AVB_C1
Last Updated : May 27, 2019, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.