
మేకిన్ ఇండియాలో భాగంగా భారత తొలి ఇంజిన్ రహిత రైలు 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్'ను చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ రైలును తొలుత ‘'ట్రైన్18'’గా పిలిచారు. ఇటీవలే కేంద్రం '‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్'’గా దీనికి నామకరణం చేశారు. 16 బోగీలు ఉన్న ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా దీనికి పేరుంది. దిల్లీ-వారణాసి మధ్య ఇది రాకపోకలు సాగించనుంది.