రుచికరమే కాదు ఆరోగ్యం కూడా...!
రాస్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రా బెర్రీ, క్రాన్ బెర్రీ, బ్లాక్ బెర్రీ ని మిక్స్ చేసి ... పైన కొంచెంగా ద్రాక్షరసాన్ని ఉంచి చేసే ఫైవ్ బెర్రీ సోబెర్ సంగ్రియా వంటి మాక్టైల్స్ని యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా కేవలం బెర్రీలే కాదు... మామిడి మొదలు అరటి వరకు వివిధ రకాల ఫలాలకి తోడు ఎలాంటి ఆల్కహాల్స్ లేని జ్యూస్‌లను కలిపి చేసే ఈ మాక్టెల్స్ని లొట్టలేస్తూ ఆస్వాదిస్తున్నారు. చూసేందుకు అందంగా... నోటికి రుచికరంగా ఉండటమే కాదు తమ ఆరోగ్యానికి కూడా ఈ పానియాలు మంచివేనంటున్నారు యువత.
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికి వాటి మజా చూపిస్తున్నాయి మాక్టెల్స్. పెరుగుతున్న డిమాండ్‌ని అందిపుచ్చుకుంటున్న పలు కేఫ్‌లు, రెస్టారెంట్లు వివిధ రకాల మాక్టెల్స్ని తయారుచేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సిప్పెయ్యండి మరీ...!