రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో ఆయనకు పోలీసు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సవాంగ్‌ను డీజీపీగా నియమించటంతో ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్ సవాంగ్‌కు పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు.
డీజీపీగా తనను నియమించినందుకు సీఎం జగన్‌కు గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. సేవాభావంతో పోలీస్ శాఖ పని చేయాలని సీఎం కోరారని సవాంగ్ తెలిపారు. శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తామన్న డీజీపీ.. పేద ప్రజలు, సామాన్యులకు పోలీసులు అందుబాటులో ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నపిల్లలపై ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. ఏపీని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కృషి చేయాలని.. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు మరింత కష్టపడాలని డీజీపీ సూచించారు. పోలీసు శాఖ తమ కోసమే ఉందని ప్రజలు అనుకునేలా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు. పోలీస్ శాఖకు కావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు సీఎం హామీ ఇచ్చారని డీజీపీ తెలిపారు. పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఇవీ చదవండి..