రాజమహేంద్రవరంలో మేడే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన... వచ్చేది చంద్రబాబు పాలనే అని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది నేతలు తమ ఆనందం కోసం సొంత లెక్కలు వేసుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. అవి ఎప్పటికీ నిజం కావని వైకాపాను ఉద్దేశించి అన్నారు. తెదేపా పాలనలో కార్మికులు, రైతులు, అసంఘటిక రంగం వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
ఇవీ చూడండి : ఏపీ మానవహక్కుల సంఘం తొలి ఛైర్మన్ ఇకలేరు