ETV Bharat / briefs

గిఫ్ట్​ ఇవ్వండి... సంతోషాన్ని పంచుకోండి - AMMA PREMA

ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉందంటే... అది ఒక్క అమ్మ ప్రేమే. అలాంటి మాతృమూర్తికి మీ ప్రేమను వ్యక్తపరిచే రోజు వచ్చేసింది. ఈ మదర్స్​డే సందర్భంగా మంచి బహుమతిని అందించి సంతోషాన్ని పంచుకోండి.

గిఫ్ట్​ ఇవ్వండి... సంతోషాన్ని పంచుకోండి
author img

By

Published : May 12, 2019, 9:03 AM IST

మాతృదినోత్సవం

మనల్ని ప్రపంచానికి పరిచయం చేసి.... మనమే ప్రపంచంగా జీవిస్తుంది. ఎలా ఉంటామో తెలియక ముందే నుంచే స్వచ్ఛంగా ప్రేమిస్తుంది. మన కోసం ఎన్నో వదులుకొని త్యాగాలు చేస్తుంది. వెల కట్టలేనంత ప్రేమ అందిస్తుంది. ఆమె ఎవరో కాదు మనల్ని ఎల్లప్పుడు కంటికిరెప్పలా కాపాడుకునే అమ్మ. ఈ మదర్స్​ డే సందర్భంగా మాతృమూర్తికి బహుమతులు ఇచ్చి... ఆమెను సంతోషపెట్టండి.

మాతృమూర్తికి మీ ప్రేమను వ్యక్తపరిచే రోజు వచ్చేసింది. మదర్స్​డేకి మీ అమ్మకు నచ్చిన బహుమతి ఇచ్చి సంతోషపెట్టండి.

అమ్మకు ఇవ్వాల్సిన బెస్ట్​ బహుమతులు....

  • అమ్మకే కాదు ఆడవాళ్లకు బాగా నచ్చేవి ఆభరణాలు. మరి మీ అమ్మకు నచ్చిన అభరణాలు గిఫ్ట్​గా ఇవ్వండి. ఏదైనా రింగ్​, చైన్​, బ్యాంగిల్స్​... తన అభిరుచికి తగ్గట్టుగా కొనండి. సర్​ప్రైజ్​ ఇవ్వండి
  • ఇప్పుడంతా గాడ్జెట్స్​ ట్రెండ్ నడుస్తోంది. అందరి చేతుల్లో నయా ఫోన్స్​.. మీ అమ్మకు కూడా ఓ బ్రాండెడ్ స్మార్ట్​​ ఫోన్​ కొని ఇవ్వండి. ట్రెండీ మమ్మీలకు కచ్చితంగా నచ్చుతుంది.
  • చీరలు... పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ఇవి ఇష్టపడని వారు ఉండరు. ఈ మదర్స్​డే సందర్భంగా మీ అమ్మకు ఓ మంచి చీరను కొనిచ్చి... తనకు సర్​ప్రైజ్​ ఇవ్వండి. తన కళ్లలో ఆనందాన్ని నింపండి.
  • ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే బ్యాగు తప్పనిసరి. తన ఇష్టానికి అనుగుణంగా బ్యాగు లేదా వ్యాలెట్ను​ బహుమతిగా ఇవ్వండి.
  • ఇంట్లో రోజువారి పనుల్లో ఎన్నో వస్తువులు ఉపయోగిస్తాం. మరి మీ అమ్మకు ఇంటికి కావాల్సిన ఏ వస్తువైనా కావాలేమో తెలుసుకుని గిఫ్ట్​గా ఇవ్వండి. తన శ్రమ తగ్గించినవారమవుతాం.
  • ఇప్పటి మదర్స్​ ఓ వైపు ఉద్యోగం, మరోవైపు ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్​ చేస్తున్నారు. పనుల్లో పడి సమయాన్ని మరిచిపోతున్నారు. ఈ మదర్స్​డేకు... ఓ మంచి వాచ్​ బహుమతిగా ఇవ్వండి. వాచ్​ని చూసినప్పుడల్లా... మీరు గుర్తొస్తారు.
  • మీ అమ్మకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లండి. రోజంతా తనతో సంతోషంగా గడపండి.
  • ఏది ఏమైనా ఈ మదర్స్​డే అనేది ఒక్కరోజు జరుపుకునేది కాదు. మీ ప్రేమ ఒక్కరోజుకు పరిమితం కావొద్దు. 365 రోజులు మీ అమ్మను ప్రేమించండి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.