పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేటు వద్ద సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 160 కేజీల గంజాయి పట్టుకున్నారు. వీటి విలువ 15 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా, రెండో వ్యక్తి విజయవాడ వాసిగా గుర్తించారు.
ఇదీ చదవండీ :