ETV Bharat / briefs

విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఇక్కట్లు

అనంతపురం జిల్లా రాయదుర్గం, గుమ్మఘట్ట కేంద్రాల వద్ద రైతులు ఇబ్బంది పడ్డారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలకై కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయారు. దీనికితోడు సర్వర్లు పని చేయకపోవడంతో రైతులు క్యూలైన్​లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చింది.

విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఇక్కట్లు
author img

By

Published : Jun 20, 2019, 6:39 PM IST

విత్తన పంపిణీ కేంద్రాల వద్ద రైతులు ఇక్కట్లు

అనంతపురం జిల్లాలో జరుగుతున్న వేరుశెనగ విత్తన పంపిణీ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయదుర్గం, గుమ్మఘట్ట మండల పంపిణీ కేంద్రాల వద్ద పరిస్థితి తీవ్రంగా ఉంది. వరుస కరవుల కారణంగా రైతుల వద్ద విత్తనం లేక సబ్సిడీ వేరుశెనగ విత్తనాలకై కేంద్రాలకు వచ్చారు. షామియానాలు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు. సర్వర్లు మొరాయించడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గంలో ఓ వృద్ధురాలు ఎండవేడిమి తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. హుటాహుటిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ :

నిర్లక్ష్యంతో ఇలా రైలు కింద పడ్డాడు

Intro:ap_knl_51_20_exams_3_debar_av_c5 s.sudhakar, dhone. దూర విద్య పరీక్షలలో చూచిరాస్తున్న ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.కర్నూల్ జిల్లా డోన్ వైష్ణవి డిగ్రీ కళాష్యాలలో డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులు నేడు పరీక్ష రాస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ రమణ రెడ్డి, కంట్రోలర్ వెంకటేశ్వర్లు తనిఖీ చేసి చూచి రాస్తున్న ముగ్గురిని డిబార్ చేశారు. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో 50 కేంద్రాల్లో ప్రస్తుతం డిగ్రీ దూరవిద్య పరీక్షలు నిన్న నుండి ప్రారంభమయ్యాయి. ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులకు కు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 29 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.అన్ని గ్రూపులకు కలిపి దాదాపు ఇరవై రెండు వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.

Body:ముగ్గురు డిబార్

Conclusion:kit no.692 s.sudhakar, dhone.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.