విశాఖ నగరంలో ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. పెళ్లై విడిపోయిన వారి కోసం నిర్వహించిన ఈ వేదికకు...విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. పెళ్లై విడిపోయిన వారికి...మళ్లీ పెళ్లి సంబంధాలు కుదరడం కష్టతరం అవుతున్న ఈ రోజుల్లో ఈనాడు సంస్థ ఇలాంటి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వధూవరుల తల్లిదండ్రులు తెలిపారు. ఈనాడు సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.
ఇవీ చూడండి : సూర్యలంకలో తెల్లవారుజామున కారు హల్చల్..