ETV Bharat / briefs

వాద్రా వాంగ్మూలం సేకరించిన ఈడీ

అక్రమ నగదు బదిలీ​ కేసులో రాబర్ట్​ వాద్రాను ఈడీ విచారించింది.

రాబర్ట్​ వాద్రా ఈడీ విచారణ పూర్తి
author img

By

Published : Feb 6, 2019, 6:50 PM IST

అక్రమ నగదు బదిలీ కేసులో రాబర్ట్​ వాద్రాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ)​ అధికారులు విచారించారు.

విదేశాల్లో స్థిరాస్తులు, ఇతర లావాదేవీలపై వాద్రాను ఈడీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్​లతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం ప్రశ్నించింది.
అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేశారు అధికారులు.

దిల్లీ కోర్టు ఆదేశాలతో దర్యాప్తు సంస్థ ఎదుట తొలిసారి విచారణకు హాజరయ్యారు వాద్రా.

కేసు నేపథ్యమిది..

రాబర్ట్ వాద్రా లండన్​లో 1.9మిలియన్​ పౌండ్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.

అక్రమాస్తుల కేసులో గతవారం వాద్రాకు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది. ఈడీ విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది.
వాద్రాతో పాటు ఆయన భార్య ప్రియాంక కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. వాద్రా లోపలికి వెళ్లిన కాసేపటికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Kanpur (Uttar Pradesh), 06 Feb (ANI): Over 40 Lakh UP state employees go on strike from today demanding the termination of the current pension scheme. It is expected to affect the transport in the state. The protestors are demanding the implementation of old pension scheme. All the unions of state have come together to participate in the strike. The protest will continue for next seven days. Government offices schools will also get a hit due to the strike.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.