ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జరిగి ఉంటే... వాటిని అమలు చేసుకోవచ్చని తెలిపారు. ఆ పథకాలపై రాజకీయ నేతల ప్రచారాలు మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ 90 శాతం పూర్తైందని ద్వివేది అన్నారు. ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ లు వినియోగిస్తున్నందున సిబ్బందికి మూడో విడత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మై వోట్ క్యూ యాప్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఈసీ తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఎన్నికల పరిశీలకులు అన్నీ అంశాలను పరిశీలిస్తున్నారని తెలిపారు.
జనవరి 11వ తేదీన జారీ చేసిన అనుబంధ జాబితాలో మాత్రమే డూప్లికేట్ ఓట్లు గుర్తించామన్న ద్వివేది... ఒక్కసారే ఓటు వేసేలా పటిష్ఠ చర్యలు చేపడతామన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.97 కోట్ల నగదు, 92 కేజీల బంగారం, 267 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. 21 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండికేసీఆర్ బిస్కెట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం : పవన్