వైకాపా ప్రభుత్వ నవరత్నాల హామీల్లో ఒకటైన మద్యపాన నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు మద్దతు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి కోరారు. మద్యపానంతో కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయన్న ఆయన...కాన్సర్లా పీడిస్తోన్న ఈ మహమ్మారిని నిషేధించాలన్నారు. పూర్తి మద్యపాన నిషేధమే ప్రభుత్వ లక్ష్యమని గుర్తుచేశారు. విడతల వారీగా చేపట్టే ఈ నిషేధంలో...ముందు బెల్టు షాపుల తొలగించడంపై దృష్టి పెట్టినట్లు నారాయణ స్వామి తెలిపారు. మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు త్వరలో నూతన పాలసీ తీసుకువస్తామ వెల్లడించారు.
ఇదీ చదవండి : ఆర్టీసీ విలీనంపై ఆరుగురు సభ్యులతో కమిటీ