ETV Bharat / briefs

మంత్రుల ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష - మంత్రివర్గం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, సీఆర్​డీఏ కమిషనర్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సచివాలయం పార్కింగ్ ఏరియాలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

cs-meet
author img

By

Published : Jun 6, 2019, 1:09 PM IST

Updated : Jun 6, 2019, 2:37 PM IST

మంత్రుల ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సమీక్ష

రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణస్వీకార ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇంటెలిజెన్స్‌ డీజీ, సీఆర్‌డీఏ కమిషనర్ పి.లక్ష్మీ నృసింహం హాజరయ్యారు. సచివాలయం పార్కింగ్‌ ఏరియాలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం కార్యాలయ పనులను వైకాపా నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పరిశీలించారు. జూన్‌ 8న ఉదయం 8.30 గంటలకు సీఎం తన ఛాంబర్‌లో అడుగుపెట్టనున్నారు.

Intro:నరసరావుపేట లో రంజాన్ పండుగను ముస్లీమ్ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో నియోజకవర్గ శాసనసభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు.

Body:ప్రార్ధనా ప్రాంగణంలో కలుసుకున్న ఇరుపార్టీ నాయకులు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ముస్లీం సోదరులతో పాటుగా ప్రార్ధనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Conclusion:కార్యక్రమంలో మొదటగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా ముస్లీం లు రంజాన్ వేడుకలను జరుపుకునేందుకు ఈద్గా వద్ద ప్రదేశం సరిపోక ఇబ్బందులు పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీ ఉన్న ప్రాంతాలను పరిశీలించి వచ్చే ఏడాదికి ప్రశాంత వాతావరణంలో ప్రార్ధనా చేసుకునే విధంగా కృషి చేస్తానని మాటిచ్చారు.
అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి అరవింద బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లీం సోదరులు స్నేహాభావంతో మెలుగుతూ ఉండాలని అన్నారు. కార్యక్రమానికి ఆహ్వానించిన అంజుమాన్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
Last Updated : Jun 6, 2019, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.