ETV Bharat / briefs

25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం - cm meeting

25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించినట్లు తెలిపారు. మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని వెల్లడించారు ముఖ్యమంత్రి.

meeting
author img

By

Published : Jun 7, 2019, 11:37 AM IST

Updated : Jun 7, 2019, 2:00 PM IST

వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో . మంత్రివర్గ కూర్పుపై చర్చ జరిగింది. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పిస్తున్నామన్నారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని తెలిపారు. మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం తమవైపు చూస్తోందని... సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని సూచించారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని నేతలకు సూచించారు.

వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్

న్యాయకమిటీ సూచనలతోనే టెండర్లు....

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌పై అడిగానని... ఇకనుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని జగన్‌ అన్నారు. ప్రతీ కాంట్రాక్టు ప్రక్రియ మొదట్నుంచీ జడ్జి వద్దకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఏడు రోజులపాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుందన్న సీఎం... జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయన్నారు. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్‌ టెండర్‌ ప్రక్రియ చేడతామని తెలిపారు. రివర్స్‌ టెండరింగ్‌లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.

అంచనాలకు మించి దోచుకున్నారు...

చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి తెదేపా నేతలు దోచుకున్నారని సీఎం అన్నారు. ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు చేస్తున్నట్లు జగన్ అన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నామన్న జగన్... అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మనం వేసే ప్రతి అడుగు ద్వారా ప్రగతి పెరగాలని నేతలకు సూచించారు. నామినేషన్‌ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పనులు కేటాయిస్తామని తెలిపారు.

25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ విత్తనాల కార్యక్రమాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతుకు విత్తనాలు పూర్తి స్థాయిలో అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు గతంలో రైతులకు అవసరమయ్యే విత్తనాలు పూర్తి స్థాయిలో అందించగా రైతులు నువ్వెలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు వైకాపా ప్రభుత్వం రైతులకు పూర్తి అడ్డుకుంటుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే రాష్ట్రం అనేక సమస్యలు పరిష్కరించాలని అన్నారు రు ప్రతి ఒక్క రైతుకు విత్తనాలు అందించాలని బ్లాక్ మార్కెటింగ్ తరలిస్తే అధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికారులు తమ పనులు చేసిన గా చేసుకుని పోతే అధికారుల మన్నన పొందుతారని తెలిపారు ఈ సందర్భంగా రైతులకు రాయితీపై విత్తనాలు అందించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బొడ్డేపల్లి సరోజమ్మ వైకాపా నాయకులు కోట గోవిందరావు చింతా రవికుమార్ బెండి గోవిందరావు గురువు శ్రీనివాసరావు బొడ్డుపల్లి నారాయణరావు వ్యవసాయ శాఖ ఏడి తిరుమల రావు ఉషారాణి లతోపాటు అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు.8008574248.

Body:రాయితీ పత్రాలు పంపిణీ

Conclusion:8008574248
Last Updated : Jun 7, 2019, 2:00 PM IST

For All Latest Updates

TAGGED:

cm meeting
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.