అమరావతి సచివాలయంలో రేపు ఉదయం 8 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 14వ తేదీన షెడ్యూల్ ప్రకటన వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్న క్రమంలో కీలక పెండింగ్ అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 7జిల్లాలు కోడ్ పరిధిలోకి రానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే లోపు రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నందున కీలక అంశాలపై సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు.
రేపు దిల్లీకి సీఎం మరోసారి...
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మధ్యాహ్నం మరోమారు దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జరిపే నిరసనకు చంద్రబాబు మద్దతు తెలపనున్నారు. అనంతరం ఎన్డీయేతర పక్షాలతో సమావేశమై తదుపరి కార్యాచరణ పై చర్చించనున్నారు.