సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు ఇవ్వాలని సూచించారు. సమస్యలను ఎప్పటిలోపు పరిష్కరిస్తారో రసీదులపై రాసి ఇవ్వాలని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన రశీదులను కంప్యూటరీకరించి.. డేటా బేస్ తయారు చేయాలన్నారు. ప్రజా సమస్యలపై కలెక్టర్లు, ఎస్పీలు నిరంతరం సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా సమస్య పరిష్కరిస్తున్నారో లేదో ఖచ్చితంగా పర్యవేక్షించాలని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేసి ప్రజల అభీష్టాలు నెరవేరాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే రచ్చబండలో భాగంగా స్పందన కార్యక్రమాన్ని పరిశీలిస్తామని జగన్ తెలిపారు. వీటిపై ప్రతీ మంగళవారం అరగంటసేపు కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా: చంద్రబాబు