ETV Bharat / briefs

అనుమానాలొద్దు.. అధికారం మనదే: చంద్రబాబు - amaravathi

అమరావతిలో పార్టీ అభ్యర్థులు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు నేతల అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్​కు ముందస్తు ప్రిపరేషన్​ ముఖ్యాంశంగా టెలీ కాన్ఫరెన్స్​ సాగింది.

టెలీకాన్ఫరెన్స్​లో సీఎం చంద్రబాబు
author img

By

Published : May 2, 2019, 12:49 PM IST

Updated : May 2, 2019, 2:22 PM IST

కౌంటింగ్​కు ప్రత్యేక బృందాలు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కౌంటింగ్​కు ప్రత్యేక బృందాలు ఏర్పడాలన్న సీఎం... కౌంటింగ్ అనుభవం ఉన్నవారిని అందుకు సన్నద్ధం చేయాలన్నారు. ఈ బృందాల్లో అడ్వకేట్, ఐటీ నిపుణుడు ఉండేలా చూడాలని చంద్రబాబు సూచించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్​ ప్రక్రియపై వర్క్ షాప్​లు నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్​కు సంబంధించి టీడీ జనార్దన్, సాయిబాబు తదితరులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.

ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉందన్న చంద్రబాబు.. అన్ని వర్గాల ప్రజలు తెదేపా పక్షం నిలిచారన్నారు. కీలక ఘట్టమైన కౌంటింగ్​కు పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. కుటుంబమైనా, పార్టీ అయినా జవాబుదారీతనంగా ఉండాలన్న ముఖ్యమంత్రి... జవాబుదారీతనంతోనే బాధ్యత, హక్కులు ఉంటాయన్నారు. బూత్​ల వారీగా పార్టీల బలాబలాలపై అవగాహన పెరగాలని సీఎం అన్నారు. గత ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించి..బూత్​ వారీగా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేయాలని కోరారు.

ఓడిపోతామన్న సీట్లలోనూ ఆధిక్యత వచ్చే అవకాశాలున్నాయన్న చంద్రబాబు...భవిష్యత్తు రాజకీయాలకు వీటిని కేస్ స్టడీగా అధ్యయనం చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు చివరి వరకు ఉండాలని.. ఎవరూ మధ్యలో వెళ్లిపోకూడదని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గాన్ని కీలకంగా తీసుకోవాలని.. ఒక్క సీటులో ఓడినా అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రతీ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చూపాలని చంద్రబాబు కోరారు.

వైకాపా దాడులు

ఎన్నికల సమయంలో లాగా వైకాపా మళ్లీ దాడులకు పాల్పడవచ్చని చంద్రబాబు అన్నారు. నేరాలు చేసి తెదేపాపై నెట్టే ప్రయత్నాలు జరగవచ్చన్న సీఎం...కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమగ్ర కార్యాచరణతో వైకాపా విమర్శలను తిప్పికొట్టాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఫారం-7 దుర్వినియోగం

దిల్లీ వెళ్లి 57లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని ఈసీకి ఫిర్యాదులు చేసిన వైకాపా నేతలు ఇక్కడకు వచ్చి ఫారం 7ను భారీ ఎత్తున దుర్వినియోగం చేశారన్నారు. రాష్ట్రంలో 7.5లక్షల ఓట్లు తొలగించే కుట్రలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎన్నికలప్పుడు దాడులకు పాల్పడిన వైకాపా 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని గుర్తు చేశారు.

కౌంటింగ్​కు ముందు వైకాపా విష ప్రచారానికి దిగే అవకాశం ఉందన్న ముఖ్యమంత్రి... పోలింగ్ రోజున చేసిన దుర్మార్గాలే కౌంటింగ్​లోనూ చేసే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులకు చెప్పారు. పార్టీ నేతలంతా ఒక్కతాటిపై ఉండి కౌంటింగ్ సజావుగా సాగేలా చూడాలని తెదేపా అధినేత సూచించారు.

ఇవీ చూడండి : కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వండి: ఈసీకి సీఎం లేఖ

Intro:kit 736

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.
jk_ap_vja_20_01_mugajeevalu_taguneeti_kastalu_pkg_c11

కోడూరు మండలంలో మూగ జీవాల త్రాగునీటి కష్టాలు

Body:కోడూరు మండలంలో మూగ జీవాల త్రాగునీటి కష్టాలు

Conclusion:కోడూరు మండలంలో మూగ జీవాల త్రాగునీటి కష్టాలు
Last Updated : May 2, 2019, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.