'బాలల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయ పార్టీల కర్తవ్యం' అన్న అంశంపై.. విశాఖ పౌరగ్రంథాలయంలో బాలవికాస్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఓటు హక్కు లేకపోయినా.. భావితరంలో తమ బాధ్యత ఉందంటూ గుర్తుచేసిన బాలలు.. రాజకీయ నేతలకు సమస్యలను వినిపించారు.
తాము చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని సమస్యలపై గళం విప్పారు. మరుగుదొడ్ల లేమి, తాగునీటి సదుపాయం, మధ్యాహ్న భోజన నిర్వహణలో నిర్లక్ష్యం, అపరిశుభ్ర పరిసరాలు వంటి సమస్యలను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చారు.
బాలలు లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్, కమ్యూనిస్టు, జనసేన, వైకాపా నేతలు స్పందించారు. పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి : 'కుటుంబ పరిస్థితులే నా విజయానికి కారణం'