ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గార్డెన్లోని ఘాట్ వద్ద కనీస ఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆశించిందని చంద్రబాబు అన్నారు. కానీ ఘాట్ వద్ద అలంకరణ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిధమైన ఘటనలు పునరావృతం కారాదని సూచించారు. ప్రభుత్వానికి ముందుగా తెలియజేయడం, వాళ్లు చేయకపోతే పార్టీ నేతలు, ఎన్టీఆర్ ట్రస్టు సభ్యులు అలంకరణ చేపట్టేలని ఆయన ఆదేశించారు. ఇటువంటి అంశాలలో సమాచారలోపం ఉండరాదని చెప్పారు.
ఇవీ చూడండి : ఓటమిపై ఆవేశం.. నాయకుల తీరుపై ఆగ్రహం!