విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. గుణదల వైపు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే కూడలి వద్ద వేగంగా వచ్చిన కారు సీసీ కెమెరాలు అమర్చిన ఇనుప స్తంభాన్ని, కరెంటు స్తంభాలను ఢీకొట్టింది. స్తంభాలు రెండు పూర్తిగా ధ్వంసమై.. కరెంటు తీగలు వేలాడుతున్నాయి. ఖరీదైన సిసి కెమెరాలు చిద్రమైనాయి. విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో పెద్దగా ట్రాఫిక్ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది.
ఇదీ చదవండీ :