ఇంద్రకీలాద్రిపై చైత్ర మాస కల్యాణ బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. నాలుగోరోజు స్వామి అమ్మవార్లు సింహవాహనంపై ఊరేగారు. నయనానందకరంగా సాగుతున్న వేడుకల్లో మహిళలు అధికంగా పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాల పల్లకిని మోయడమే కాక... సింహవాహనాన్ని సైతం మహిళా భక్తులే లాగారు. భక్త బృందాల కోలాటాలు, వాయిద్యాల నడుమ దేవతా మూర్తుల వాహన సేవ ఘనంగా జరిగింది.
ఇవీ చదవండి...