ETV Bharat / briefs

పట్టుదల ముందు చిన్నబోయిన అంధత్వం

అవయవలోపం...అతని ముందు చిన్నబోయింది. అంతులేని ఆత్మవిశ్వాసం అతని విజయానికి బాటలు వేసింది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన ఈ యువకుడు...కంటిచూపు లేకపోయినా ఆడియో పాఠాల ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమై ప్రభుత్వ కొలువు సాధించాడు.

అప్పన్న పట్టుదల ముందు...అంధత్వం చిన్నబోయింది!
author img

By

Published : Jun 5, 2019, 7:30 PM IST

అప్పన్న పట్టుదల ముందు...అంధత్వం చిన్నబోయింది!
అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా...పెట్టుకున్న లక్ష్యం కోసం తంటాలు పడుతుంటాం. సాకులు చెప్తూ...పక్కవారిని నిందిస్తుంటాం. అదృష్టం, డబ్బు ఏవేవో కారణాలు జోడిస్తూ మన పొరపాట్లను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. సాధించాలనే తపన ఉంటే చాలు ఇవేవీ అవసరం లేదని నిరూపించాడో యువకుడు. కంటి చూపు లేకపోయినా...ఆడియో సిలబస్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఐబీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడై..ప్రముఖ బ్యాంకులో ఉద్యోగం సాధించాడు.

కుటుంబ నేపథ్యం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి పంచాయతీలోని రెయ్యిపేటకు చెందిన పరపటి అప్పన్న అంధత్వలోపంతో జన్మించారు. తన స్థితికి ఎప్పుడూ చింతించని అప్పన్న..ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అప్పన్న తల్లిదండ్రులు కర్రెయ్య, సీతమ్మ. వారికి ఇద్దరు కుమారులు. వారివురికీ అంధత్వంలోపం ఉంది. అప్పన్న సోదరుడు రమేష్..జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్​ పోటీల్లో రాణిస్తున్నాడు.

విద్యాభ్యాసం
అప్పన్న ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నం, విజయనగరంలోని అంధత్వ పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్​ మహబూబ్​నగర్ అంధత్వ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం 2008 నుంచి 2011 వరకు హైదరాబాద్​లోని బాబూ జగ్జీవన్ రామ్ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక బతుకుదెరువు కోసం అంధుల ఆర్కెస్ట్రాలో చేరాడు. ఓ వైపు ప్రదర్శనలిస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. విజయవాడ విజన్ త్రూ ఇయర్స్ అనే సంస్థ ఆడియో పాఠాల ద్వారా సాధన ప్రారంభించి 2018లో ఐబీపీఎస్ పీవో పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఈ పరీక్షలో విజయం సాధించి యూనియన్ బ్యాంక్​ పీవోగా ఉద్యోగం పొందాడు.

యూనియన్ బ్యాంక్ పీవోగా ఎంపికైన అప్పన్న...ఓ సర్టిఫికెట్ కోసం టెక్కలి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ శ్రీనివాసరావు అతన్ని అభినందించారు. పరీక్షలో తప్పితే ఓటమికి కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో...అవయవలోపం ఉన్నా విజయం సాధించిన అప్పన్న అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇవీ చూడండి : ఇళయరాజాకు కోపమొచ్చింది..

Chennai, Jun 05 (ANI): Tamil Nadu Deputy Chief Minister O Panneerselvam and his son Raveendranath Kumar paid a floral tribute to Jayalalithaa and MG Ramachandran on Wednesday. Both deceased memorial located at Marina Beach in Chennai. Floral tributes were paid and pledges were taken by AIADMK leaders and workers at her memorial. Jayalalithaa died of cardiac arrest on December 05, 2016.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.