Minister Lokesh Chit Chat With Media in Assembly Lobby : తెలుగుదేశం శ్రేణుల ధైర్యాన్నీ వైఎస్సార్సీపీ శ్రేణుల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గత ఐదేళ్లు తెలుగుదేశం శ్రేణుల్ని పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెట్టిన అసభ్యకర పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసు ఇస్తున్నా రాజకీయ సన్యాసం అంటూ వైఎస్సార్సీపీ నేతలు పిరికితనం చాటుతున్నారని ఎద్దేవా చేశారు.
నాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయలేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు తప్పు చేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పేర్కొన్నారు.
జగన్ తన అభ్యర్థులు కమిటీల ఓటింగ్‌కు వస్తున్నారా అని ఎమ్మెల్యేలను ఆరా తీశారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. ఓటింగ్‌కు రావాలా వద్దా అనే మీమాంసలో ఎందుకు పడాలన్నారు. నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లపై ఎమ్మెల్యేలతో లోకేశ్ చర్చించారు. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారంటే వారి ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే విషయం మర్చిపోకూడదని స్పష్టం చేశారు. జాగ్రత్తగా పని చేయమని బాధ్యతనిస్తూ ఎక్కువ ఓట్లతో మనల్ని ప్రజలు గెలిపించారన్నారు.
ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా టార్గెట్ : లోకేశ్
ఎమ్మెల్యేల వినతులపై లోకేశ్ స్వయంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు తనకు ఇచ్చిన ప్రతీ వినతిపత్రంలో ఎన్ని పరిష్కారమయ్యాయి, అలాగే కాని వాటికి గలా కారణాలు వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడా అమలు చేస్తున్నామని వెల్లడించారు.
రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. స్కూళ్ల సమయం పెంపు పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు లోకేశ్ దృష్టికి తెచ్చారు. తనకూ ఈ అంశంపై ఫీడ్ బ్యాక్ వచ్చిందన్న మంత్రి పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే దీనిని అమలు చేస్తున్నామని, ఫీడ్ బ్యాక్ తగ్గట్లు నిర్ణయాన్ని మార్చుకుంటామని తెలిపారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచుతామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
"సంస్కారహీనంగా మాట్లాడారు" - అంబటి, కొడాలి నాని, రోజాపై ఫిర్యాదు