TGPSC Group 2 Admit Card Releases And Exams in December : రాష్ట్రంలో 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టుల భర్తీకి డిసెంబరు 15, 16 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు డిసెంబరు 9 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. పరీక్షలకు సంబంధించిన సమగ్ర టైంటేబుల్, సూచనలతో కూడిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచింది. ప్రతి పేపరులో 150 ప్రశ్నలుంటాయి. 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
అరగంట ముందు వరకే అనుమతి : పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందు గేట్లు మూసివేస్తామని, ఉదయం నిర్వహించే పరీక్షకు 9.30 గంటలు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.30 గంటల తరువాత అభ్యర్థులెవరినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ ఇ.నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు అందిస్తామని, ఈ మేరకు నమూనా ఓఎంఆర్ షీట్లు, సూచనలు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. పేపర్-1 పరీక్ష రాసిన హాల్‌టికెట్‌తోనే మిగతా పరీక్షలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రాలు నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రపరుచుకోవాలని, వాటిని అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
'గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయండి' - అభ్యర్థుల విజ్ఞప్తికి ఏపీపీఎస్సీ పరిశీలన
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయాలని లేదా Helpdesk@tspsc.gov.in చిరునామాకు ఈ-మెయిల్ చేయాలని తెలిపారు.