పుట్టుకతోనే 80 శాతం అంధత్వం.. మెలనిన్ లోపంతో వచ్చే ఆల్బిజం వ్యాధి చూపునైతే తీసుకుంది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఏం చేయలేకపోయింది. చదువుల్లో రాణిస్తున్న చిన్నారి...పదోతరగతిలో 9.7 జీపీఏ స్కోరు అవలీలగా సాధించింది.
హరిణి ఈ పేరు గుంటూరు భాష్యం పాఠశాలలో సుపరిచితం. రెండడగుల దూరం వరకే చూడగలిగే ఈ చిన్నారి చదువులో మాత్రం టాపర్. అదే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సంగడిగుంటకు చెందిన ప్రభాకరరావు, శిరీషల కుమార్తె హరిణి. ఆల్బిజం వ్యాధితో చూపు కోల్పోయిందన్న వైద్యుల మాట కన్నవారిలో ఆందోళన కలిగించింది. తర్వాత తేరుకొని ఆ లోటు కనిపించకుండా హరిణిని ఆత్మస్థైర్యంతో పెంచారు.
జీవితంలో ఉన్నతస్థానానికి ఎదగాలనే ఆశయానికి... వైద్యుల సలహాలు ఆయువు పోశాయి. టెలిస్కోపు, మ్యాగ్నిఫైయింగ్ పరికరాలనుపయోగించి చదవడం అలవర్చుకుంది. పదోతరగతి పరీక్షల కోసం అహర్నిశలు కష్టపడింది. సహాయకుల అండతో పరీక్షలు రాసి...సాధారణ విద్యార్థులకు పోటీగా నిలిచింది. 3 సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కుల సాధించి 9.7 జీపీఏ స్కోరుతో ఔరా అనిపించింది.
ఆత్మవిశ్వాసమే తనను ముందుకు నడిపిస్తోందని... ఈ విజయం ఆరంభమేనని చెబుతోంది హరిణి.
ఇవీ చదవండి..మనసుకు ఉల్లాసం ..భావి తరాలకు ఆదర్శం