ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని హామీఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించాలని భాజపా నేత మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించి పురందేశ్వరి పర్యటించారు. రాష్ట్ర భాజపా బాధ్యులు సునీల్ దియెదర్ పాల్గొని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తెదేపా జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబు దంపతులు భాజపాలో చేరగా వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో అవినీతిరహిత పరిపాలన కొనసాగించాలని పురందేశ్వరి ప్రభుత్వానికి సూచన చేశారు.
ఇదీ చదవండీ :