సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూలోని లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ విశాల్ గున్నీతో కలిసి ఆయన పరిశీలించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలోకి మొబైల్స్ అనుమతించబోమన్నారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్లు లెక్కిస్తామన్నారు. విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని కలెక్టర్ అన్నారు.
ఇవీ చూడండి : తూర్పు తీరం చేరేది...ఎవరో?