తెలుగుదేశం పార్టీ తరఫున జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో సహకారం అందిస్తామని తెలిపారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
![letter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3421907_letter.jpeg)