అనంతపురం జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా మారుస్తానన్న సీఎం...యువతకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. వివేకా హత్యపై సిట్ విచారణకు ఆదేశిస్తే జగన్ ఎందుకు ఒప్పుకోలేదని ప్రశ్నించారు. పెళ్లికానుక ఆర్థికసాయాన్ని రూ.లక్షకు పెంచుతామన్న చంద్రబాబు.... ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ కింద రూ.5 లక్షలు, చంద్రన్న భీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నామని అన్నారు. దిల్లీలో అవార్డులు ఇచ్చి.... ఇక్కడకొచ్చి తిడతారని అన్నారు.నేరస్థులు, రౌడీల గుండెల్లో నిద్రపోతానన్నారు.
తాను ఒక్కటికాదు.. 20 హైదరాబాద్‌లు తయారుచేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం ఎప్పుడూ ఆనందపురంగా ఉండాలన్నారు. మన వద్ద శాస్త్రవేత్తలు ఉన్నారనీ.. వాళ్లను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు ఉంటాయనీ చెప్పారు. అంతా చేయిచేయి కలిపితే ఏపీ నెంబర్‌వన్ అవుతుందని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి రైతుల కష్టాలు తీర్చుతానన్నారు. కరవుసీమకు కియా మోటార్స్ తీసుకువచ్చిన ఘనత తమదేనన్నారు. కోడి కత్తి పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబే రావాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:వైకాపాకు పడే ఓట్లన్నీ... భాజపాకు వేసినట్లే!